బస్తీ దవాఖానాను తనిఖీ చేసిన కలెక్టర్

SDPT: జిల్లా కేంద్రంలోని బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ కె. హైమావతి సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి లీవ్ లెటర్లు చెక్ చేశారు. డిప్యూటేషన్‌లను రద్దు చేశామని.. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.