సిడి బండిలో ఎస్సీ కులం వ్యక్తి ఉండడానికి కారణం ఇదే.!
కృష్ణా: ఉయ్యూరు వీరమ్మ తిరణాలల్లో 11వ రోజు సిడి బండి ఉత్సవం జరగనుంది. ఈ సిడి బండి ఉత్సవంలో ఎస్సీ కులానికి చెందిన యువకుడిని కూర్చోబెట్టడానికి వెనక పెద్ద కారణం ఉంది. వీరమ్మ తల్లి సతీ సహగమనానికి గుండం తవ్వేందుకు ఉప్పర కులస్తులు ముందుకు రాకపోవడంతో మాదిగ వర్గానికి చెందిన వారు తవ్వారని, అందుకే సీడీ బండి ఉత్సవం రోజున ఆ కులానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.