పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు నిరసన

పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు నిరసన

దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 'ఇండియా' కూటమి ఎంపీలు భారీ నిరసన చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం 'ఎంప్టీ ప్రామిస్' (ఖాళీ వాగ్ధానాలు) చేస్తోందని ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యావసర ధరలు, నిరుద్యోగంపై ప్లకార్డులతో నినదించారు. మోదీజీ.. ఎల్పీజీ అంటూ నిరసనలు తెలిపారు.