సౌత్ జోన్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన జిల్లా విద్యార్థి
NLG: కాకినాడ JNTUH యూనివర్సిటీలో ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి సౌత్ జోన్ వాలీబాల్ పోటీలకు నాగార్జునసాగర్ బీసీ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న శివకుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఇన్‌ఛార్జి మురళి అతడికి అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని శివకుమార్ తెలిపారు.