అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: పెనమలూరు(M) గోసాల, వణుకూరు, గంగూరు గ్రామాల్లో రూ.2.50 కోట్ల రోడ్డు అభివృద్ధి పనులకు MLA బోడె ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. గంగూరు–వేల్పూరు కనెక్టివిటీ రోడ్డుకు రూ.60 లక్షలు, గోసాల సాయిబాబా గుడి కట్ట రోడ్డుకు రూ.50 లక్షలు, వణుకూరు లేఔట్‌లో రూ.1.33 కోట్లతో పనులు చేపట్టామన్నారు. త్వరలో బందర్ రోడ్డు - మద్దూరు రోడ్డు శంకుస్థాపన చేస్తామన్నారు.