VIDEO: భక్తులతో కిటకిటలాడుతున్న ఛాయ సోమేశ్వరాలయం
NLG: కార్తీక పౌర్ణమి సందర్భంగా పానగల్లులోని పచ్చల ఛాయ సోమేశ్వరాలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు దర్శనార్థం క్యూలైన్లలో నిలబడ్డారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పడగా, ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక దీపాల వెలుగుతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.