రథోత్సవానికి ఆర్థిక సహాయం అందజేత

రథోత్సవానికి ఆర్థిక సహాయం అందజేత

KRNL: ఆస్పరి మండలంలో పర్యటించిన జనసేన ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప శ్రీ పక్కీరప్ప తాత దేవాలయ నూతన రథోత్సవ నిర్మాణానికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం NDA కూటమి పెద్దలు, యువతతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఇందులో అతని వెంట BJP ఇన్‌ఛార్జ్ వెంకటరామయ్య ఉన్నారు.