జిల్లాలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు
BPT: ఈ నెల 9న సీఎం చంద్రబాబు సూరేపల్లెకు రానున్నారు. ఆయన పర్యటనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. సీఎం పర్యటనలో భద్రత, ప్రోటోకాల్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.