'భక్తులకు ప్రత్యేక ప్యాకేజీతో బస్సు ప్రయాణం'

'భక్తులకు ప్రత్యేక ప్యాకేజీతో బస్సు ప్రయాణం'

VKB: పుణ్య క్షేత్రాలను సందర్శించే భక్తుల కోసం పరిగి RTC డిపో మేనేజర్ కే.కృష్ణమూర్తి శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, జోగులాంబ అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ప్యాకేజీతో బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,000గా నిర్ణయించారు. నవంబర్ 3న బయలుదేరి 6న తిరిగి చేరుతుందన్నారు.