భక్తులను మోసం చేసిన టీటీడీ ఉద్యోగి అరెస్టు

భక్తులను మోసం చేసిన టీటీడీ ఉద్యోగి అరెస్టు

TPT: తిరుమల టౌన్ పోలీసులు టీటీడీ ఉద్యోగి మాలే శంకరయ్యను అరెస్టు చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో మజ్దార్‌గా పనిచేస్తున్న శంకరయ్య, దర్శనాలు,సేవా టిక్కెట్లు, వసతి గదులు కల్పిస్తానని చెప్పి యాత్రికుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దళారీ టాస్క్ టీమ్ పర్యవేక్షణలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.