తెనాలిలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు
GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని 13వ వార్డులో సోమవారం స్పెషల్ శానిటేషన్ పనులు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధిక, కౌన్సిలర్ సుజాత అధికారులతో కలిసి వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ మేరకు మెయిన్ డ్రైన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగింపజేసి, పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.