VIDEO: భూ తగాదా హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో 2021లో భూ తగాదాల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఇవాళ జిల్లా జడ్జి రమేష్ బాబు తీర్పు ప్రకటించారు. భూ వివాదం కారణంగా జరిగిన హత్యను నిరూపించే సాక్ష్యాలు, ఆధారాలను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.