ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి
CTR: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుమూరు మండలంలో జరిగింది. మండలంలోని స్వామి రెడ్డి పల్లికి చెందిన గోవిందు బైక్‌పై వస్తుండగా.. పాకాల మండలానికి చెందిన బాబు, రెడ్డప్ప ఆచారి మరొక బైక్‌లో వస్తూ చార్వగాని పల్లె సమీపంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో గోవిందు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.