ఘనంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు

ప్రకాశం: బెస్తవారిపేట మండలం జేసీ అగ్రహారం గ్రామంలో శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ వార్షికోత్సవ పురస్కరించుకొని ఆదివారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి బండలాగుడు పోటీలు ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.