కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు

ATP: బెళుగుప్ప మండల కేంద్రంలో ఆదివారం ఎస్సై శివ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బెళుగుప్పలో అక్రమంగా కర్ణాటక మద్యం ప్యాకెట్లు కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 70కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టుకు హాజరుపరిచారు. అక్రమంగా కర్ణాటక మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.