ఓటు వెయ్యలేదుగా.. డబ్బులు తిరిగి ఇవ్వండి!

ఓటు వెయ్యలేదుగా.. డబ్బులు తిరిగి ఇవ్వండి!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ 49.4 శాతమే నమోదైంది. దీంతో ఓ పార్టీ.. డబ్బులు తీసుకొని ఓటు వెయ్యనివారి నుంచి తిరిగి వసూల్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ బూత్ ఏజెంట్లు ఇప్పటికే పోలింగ్ రోజు ఇళ్ల నుంచి బయటకు రాని ఓటర్లను గుర్తించారని సమాచారం. ఈ క్రమంలోనే డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయా కాలనీల పెద్దలు, అపార్ట్‌మెంట్ వాసులను అడిగినట్లు తెలుస్తోంది.