సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిపై ఎమ్మెల్యే ఫిర్యాదు

SKLM: పలాస మండలం సుమ్మాదేవి గ్రామానికి చెందిన దివ్యాంగుడు దున్న బాలకృష్ణ తనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాసలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి అప్పలరాజు సోషల్ మీడియాలో నీచాతి నీచంగా వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి అనిత ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని శిరీష కోరారు.