VIDEO: కలెక్టరేట్ వద్ద డయాలసిస్ పేషెంట్లు ఆందోళన

W.G: భీమవరంలోని ఓ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో బాధితులు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి మాట్లాడుతూ.. డయాలసిస్ కోసం ఆరోగ్యశ్రీపై ఆధారపడిన సుమారు 200 మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం DMHO డాక్టర్ జీ.గీతాబాయికు సమస్యను తెలియజేశారు.