బంగారు పతకం సాధించిన గాంధారి ఏకలవ్య క్రీడాకారులు

బంగారు పతకం సాధించిన గాంధారి ఏకలవ్య క్రీడాకారులు

KMR: తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీల్లో గాంధారి ఏకలవ్య పాఠశాల క్రీడాకారులు గోల్డ్ మెడల్ సాధించి విజేతలుగా నిలిచారు. కొత్తగూడెంలో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరిగిన ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్‌లో గాంధారి క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ విజేతలను శనివారం అభినందించారు.