మీసేవ కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ హెచ్చరిక

VKB: మీసేవ కేంద్రాల నిర్వాహకులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ హెచ్చరించారు. వికారాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమాయక ప్రజలను మోసం చేసి.. డబ్బుల వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.