ఫీజు రీయంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి: BRSV
GDWL: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్‌ఎస్‌వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం 'చలో కలెక్టరేట్' కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు.