ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: ACP

NZB: ట్రాఫిక్ నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. నిబంధనలు పాటించకపోతే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాల నుంచి తొలగించిన సుమారు 200 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు.