'తాగునీటి కొరత నివారణకు ప్రణాళికలు రూపొందించండి'
KRNL: రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు తలెత్తకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఆదోని మండలం, బసాపురం గ్రామంలోని సమ్మర్ స్టోరేజ్ (ఎస్.ఎస్.) ట్యాంక్‌ను ఇవాళ కలెక్టర్ పరిశీలించారు. ట్యాంక్ మరమ్మతు పనులను నవంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు.