శబరిమల సైకిల్ యాత్ర ప్రారంభం

శబరిమల సైకిల్ యాత్ర ప్రారంభం

KMR: నాగిరెడ్డిపేట్‌ మండలం తాండూరు గ్రామానికి చెందిన అయ్యప్ప గురు స్వామి భీంరెడ్డి, మీసానిపల్లి గ్రామానికి చెందిన గోపాల్ స్వామి బుధవారం శబరిమల యాత్రను సైకిల్‌పై ప్రారంభించారు. త్రిలింగరామేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాల అనంతరం యాత్ర మొదలైంది. ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప దీక్ష స్వాములు, గ్రామ పెద్దలు వీరిని సన్మానించారు.