ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
KMM: SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతులకు ఉమెన్స్ టైలరింగ్, మగ్గం(ఎంబ్రాయిడరీ), బ్యూటిషన్ పై ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని, వచ్చేనెల 5లోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.