విద్యుత్ ఘాతంతో రెండు గేదెలు మృతి

విద్యుత్ ఘాతంతో రెండు గేదెలు మృతి

PDPL: మంథని మండలంలోని చిన్న ఓదాల గ్రామానికి చెందిన లెంకల చెంద్రయ్య, సుంకరి రమేష్‌లకు చెందిన రెండు గేదెలు విద్యుత్ ఘాతంతో మృతి చెందాయి. ఆదివారం ఉదయం మేతకు వెళ్లిన బర్రెలు విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. విద్యుత్ వైర్లు తెగిపోయాయని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని రైతులు వాపోయారు.