'ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్'

'ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్'

జగిత్యాల జిల్లాలో డిసెంబర్ 21న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి తెలిపారు. 18 సంవత్సరాల నుంచి సుమారు 17074 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌కు అందరూ సహకరించి పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యంగా రాజీమార్గంతో పరిష్కరించుకునేందుకు కోర్టుకు హాజరవ్వాలని సూచించారు.