VIDEO: తోటలో ఎలుగుబంట్లు హల్ చల్
SKLM: మందస మండలం పితాళి నల్లూరు గ్రామాల మధ్య ఉన్న జీడి మామిడి తోటల్లో ఆదివారం ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి. రెండు రోజులుగా సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. అక్కడి ఉన్న పుట్టలను ఆహారం కోసం పదునైన గోళ్ళతో తవ్వుతున్నాయి. అటువైపుగా వెళ్లిన యువకులు దూరం నుంచి వీడియోలో చిత్రీకరించారు.