ఇదెక్కడో కాదు మన బంజారాహిల్స్‌లోనే..!
HYD: బంజారాహిల్స్ రోడ్ నం. 5లోని దేవరకొండ బస్తీలో నాలా పనుల జాప్యంపై స్థానికులు మండిపడుతున్నారు. 2 నెలలుగా పనులు సాగదీయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత్యంతరం లేక నాలా దాటేందుకు కట్టెలతో వంతెన ఏర్పాటు చేసుకుని ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేదని, నగరం నడిబొడ్డున ఈ దుస్థితి ఏమిటని బస్తీ వాసులు అంటూన్నారు.