రేపు జిల్లాలో కార్మిక శాఖ మంత్రి పర్యటన
SKLM: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ గురువారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి సుభాష్ గురువారం ఉ.9.30 కు శ్రీకాకుళం చేరుకుంటారు. జిల్లాలోని వివిధ పరిశ్రమలను సందర్శి స్తారని తెలిపారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.