పాముకాటుకు మహిళ మృతి

కాకినాడ: కోటనందూరు గ్రామానికి చెందిన గరిశింగు సీత (35) పాము కాటుకు గురై మృతి చెందింది. గురువారం పొలంలో వరి నాట్లు వ్యవసాయ పనులకు వెళ్లగా కాకరాపల్లి గ్రామంలో పాదాలమ్మ చెరువు సమీపంలో పాముకాటుకు గురైంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందిందని స్థానికులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని కోటనందూరు మండల వైస్ ప్రెసిడెంట్ కొరుప్రోలు రమణమ్మ పరామర్శించారు.