'పంచాయతీ భవనం నిర్మించాలి'

'పంచాయతీ భవనం నిర్మించాలి'

ASR: హుకుంపేట మండలం జీ. బొడ్డాపుట్టు పంచాయతీకి పంచాయతీ భవనం నిర్మించాలని ఆ పంచాయతీ వాసులు కోరారు. గురువారం రాత్రి అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను కలిసి వినతిపత్రం అందజేశారు. పంచాయతీ భవనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం పంచాయతీ భవనం మంజూరు చేసి వెంటనే నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.