పాలవలసలో పొలంబడి కార్యక్రమం

SKLM: సోంపేట మండలం పాలవలస గ్రామంలో గురువారం పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో బీ. నరసింహమూర్తి పాల్గొని రైతులకు తగు సూచనలు, సలహాలు తెలియజేశారు. వరి పంటకు ఎరువుల వాడకం గూర్చి వివరించారు. అలాగే ప్రతి రైతు వరి పంటకు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఏవో ప్రదీప్, రైతులు పాల్గొన్నారు.