జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసిన ఎస్పీ

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసిన ఎస్పీ

KRNL: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారిని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు వెళ్తూ కర్నూలు అతిథి గృహానికి వచ్చిన ఆయనకు పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు, బాధితులకు చట్ట సహాయం, పలు అవగాహన కార్యక్రమాలపై చర్చించారు.