పాక్‌లో నిరసనలు.. 22 మంది మృతి
ఖమేనీ మృతితో పాక్‌లో షియా వర్గానికి చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కరాచీ, లాహోర్, పెషావర్ వంటి ప్రధాన నగరాల్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారు. మరో 120 మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు.