జిల్లాలో 305 ట్రాఫిక్ కేసులు నమోదు
KDP: ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో వెళ్లేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 305 మందిపై కేసులు నమోదు చేసి, రూ.65,235 జరిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని SP సూచించారు.