శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు

NDL: రుద్రవరం మండలం వెలగలపల్లి గ్రామ శివారులలో వెలసిన వాసాపురం శ్రీలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భద్రపద మాసం శనివారం సందర్భంగా విశేష పూజలు చేశారు. వేద పండితులు సామూహిక కుంకుమార్చన అష్టోత్తర పూజలను నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.