ALERT కడప జిల్లాలో నేడు భారీ వర్షాలు
KDP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 'మొంథా' తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. రాబోయే అయిదు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శనివారం, ఆదివారం, సోమ, మంగళవారాల్లో కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది.