పార్లమెంట్ ప్రాంగణంలో ‘సేవ్ ఆర్డీటీ’ నినాదాలు
ATP: ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలో సోమవారం వైసీపీ ఎంపీలు, ముఖ్య నేతలు 'సేవ్ ఆర్డీటీ' పోస్టల్ కార్డులతో నిరసన తెలిపారు. ఆర్డీటీ సంస్థను కాపాడాలంటూ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, గురుమూర్తి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మల్లికార్జున రెడ్డి, తనుజ, తదితరులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పేదలకు సేవలందిస్తున్న సంస్థపై వేధింపులు ఆపాలని వారు డిమాండ్ చేశారు.