యాసంగికి సరిపడా యూరియా: కలెక్టర్

యాసంగికి సరిపడా యూరియా: కలెక్టర్

NZB: ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగుకు రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. కలెక్టర్ సోమవారం డిచ్‌పల్లి మండలం సుద్దులం సహకార సంఘం ఎరువుల గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, గిడ్డంగిలో ఉన్న నిల్వలను పరిశీలించారు.