మరోసారి ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోని

ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోనీ ఆల్బనీస్ మరోసారి ఎన్నికయ్యారు. 2004 తర్వాత వరుసగా రెండోసారి ఎన్నికైన తొలి ప్రధానిగా ఆంథోనీ చరిత్రకెక్కారు. ఓట్ల లెక్కింపులో లేబర్ పార్టీ 86 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో మరో మూడేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఓటమిపై ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్ స్పందించారు. తాము సరిగ్గా రాణించలేదని తెలిపారు.