సచిన్ ‘సెంచరీల’ రికార్డ్‌పై గిల్ గురి

సచిన్ ‘సెంచరీల’ రికార్డ్‌పై గిల్ గురి

సౌతాఫ్రికాతో నేటి నుంచి జరిగే 2 టెస్టుల సిరీస్‌లో భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు సచిన్ రికార్డును సొంతం చేసుకునే సువర్ణావకాశం ఉంది. ఈ సిరీస్‌లో గిల్ 3 సెంచరీలు చేస్తే అత్యధిక టన్స్ చేసిన భారత 4వ కెప్టెన్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం సచిన్ 7 సెంచరీలతో 4వ స్థానంలో ఉండగా.. గిల్ 5 శతకాలతో గంగూలీ, ధోనీ, మన్సూర్ పటౌడీ సరసన 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.