అక్రమ కట్టడాలను తొలగించిన అధికారులు

అక్రమ కట్టడాలను తొలగించిన అధికారులు

KDP; ప్రొద్దుటూరు మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద ఆక్రమణలను శనివారం ఉదయం మున్సిపల్ అధికారులు తొలగించారు. మున్సిపాలిటీ స్థలంలో కొంతమంది ఆక్రమణలు చేసి, కట్టడాలు నిర్మించారు. వీటిని బాడుగలకు ఇచ్చుకున్నారు. వీటిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణలను తొలగించారు.