VIDEO: వర్షాకాలం వస్తే వాగు దాటలేక అవస్థలు

NDL: కొత్తపల్లె మండల శివపురం - లింగాపురం గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు వర్షాకాలం వస్తే ప్రజలకు పెద్ద అడ్డంకిగా మారుతోంది. ఇటీవలి వర్షాలతో వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో దాదాపు 11 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో ఈ వాగు దాటే క్రమంలో ప్రాణనష్టం జరిగినప్పటికీ ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.