ముగిసిన మూడో విడత నామినేషన్ల ప్రక్రియ

ముగిసిన మూడో విడత నామినేషన్ల ప్రక్రియ

WNP: పంచాయతీ ఎన్నికలకు మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభం కాగా శుక్రవారం గడువు ముగిసింది. మూడో విడతలో పెబ్బేరు మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. అటు మూడో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు.