నల్లమల అడవిలో చెలరేగిన మంటలు..!
NDL: మహానంది-బండి ఆత్మకూరు మండలాల సరిహద్దులో ఉన్న బైరేని తిప్ప వద్ద నల్లమల అడవిలో సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. వేసవికాలం కావడంతో నల్లమల అడవిలో మంటలు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది మంటలను ఆర్పారు.