తుపాకీ రోహిత్ తమ్ముడిది: చేవేళ్ల డీసీపీ

తుపాకీ రోహిత్ తమ్ముడిది: చేవేళ్ల డీసీపీ

TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని చేవెళ్ల డీసీపీ యోగేష్ తెలిపారు. పార్టీ నిర్వహణపై రాత్రి 9:30 గంటలకు సమాచారం అందిందని, ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక రౌండ్ కాల్పులు జరిపారని పేర్కొన్నారు. కాల్పులు జరిపిన తుపాకీ రోహిత్ తమ్ముడిదిగా గుర్తించామన్నారు. కాల్పులు జరిపింది నమిత్‌శర్మ అని వెల్లడించారు.