నేడు గండిపేటకు సీఎం

HYD: నేడు గండిపేటలో CM రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ నారాయణరెడ్డి, MLA ప్రకాశ్ గౌడ్, జలమండలి MD అశోక్ రెడ్డి, రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3కు శంకుస్థాపన, ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2ను CM ప్రారంభిస్తారు. అనంతరం CM బహిరంగ సభ ఉంటుందని MLA ప్రకాశ్ గౌడ్ తెలిపారు.