ధాన్యం లోడుతో వెళుతున్న లారీ బోల్తా

ధాన్యం లోడుతో వెళుతున్న లారీ బోల్తా

BHPL: గోవిందరావుపేట మండలం పసరలోని జాతీయ రహదారి 163పై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. పసర-తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై గుండ్లవాగు సమీపంలోనీ భారీ మూలమలుపు వద్ద ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.