జిల్లాలో మండిపోతున్న ఎండలు
ATP: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42°C నుంచి 44°C వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి, శింగనమల వంటి ప్రాంతాల్లో వేడి గాలులు తీవ్రంగా ఉన్నాయి. ఉదయం 11గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.